- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీకి గుడ్ న్యూస్.. 13,050 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)కి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. గంగవరం పోర్టు(Gamgavaram Port) ద్వారా ఈనెల 20న రాష్ట్రానికి కేంద్రం యూరియా పంపుతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) తెలిపారు. రైతులకు ఇచ్చేందుకు ఎరువులు అందుబాటులో ఉన్నట్లు ఆయన చెప్పారు. కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఎరువుల కొరతతో రైతులు అల్లాడిపోతున్నారు. పంటలు పండించేందుకు యూరియా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యూరియా పంపిణీ చేసే కేంద్రాల వద్దకు తెల్లవారుజామునే వెళ్లి పడిగాపులు కాస్తున్నారు. కొన్ని సమయాల్లో అస్వస్థతకు గురై పలువురు రైతులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ నేపథ్యంలో యూరియా అవసరాలను కేంద్రం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లింది. ఈ మేరకు రాష్ట్రానికి యూరియా పంపేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా యూరియా దిగుమతులపై రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దీంతో రాష్ట్రానికి యూరియా వచ్చే తేదీని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.






