ఏపీ రాజధానికి గుడ్ న్యూస్.. రూ.4, 200 కోట్లు విడుదల

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-07 06:30:47  IST  )

ఏపీ రాజధానికి కేంద్రం న్యూస్ ప్రకటించింది...

ఏపీ రాజధానికి గుడ్ న్యూస్.. రూ.4, 200 కోట్లు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని(AP Capital)కి కేంద్రం న్యూస్ ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు మద్దతుతో అమరావతి అభివృద్ధి(Amaravati Development)కి రూ. 4,200 కోట్లు విడుదల చేసింది. దీంతో అమరావతి అభివృద్ధి పనులు మరింత ఊపందుకోనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి అభిృద్ధిపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు కావాల్సిన నిధులు విడుదల చేయాలని కేంద్రప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandhra Babu) కోరుతున్నారు. ఢిల్లీ(Delhi) వెళ్లి మరీ కేంద్రమంత్రులను కలిసి నిధుల విడుదలు చేయాలని అభ్యర్థిస్తున్నారు.

అటు కేంద్రప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందిస్తోంది. పలు కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించింది. పోలవరం(Polavaram), విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) లాంటి పెద్ద ప్రాజెక్టులకు సైతం చేయూతనిచ్చింది. వేల కోట్ల నిధులను ఇప్పటికే అందించింది. అమరావతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పలుమార్లు రాష్ట్ర ఎంపీలు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) కృషి వల్లే రాష్ట్రానికి అధిక నిధులు అందుతున్నాయని తెలిపారు.

Next Story