- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనగణనలో సీఎం చంద్రబాబు.. సామాన్యూడిలా వ్యక్తిగత వివరాలు నమోదు
ఏపీ వ్యాప్తంగా జనగణన కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగుతోంది..ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొని పౌరులందరికీ స్ఫూర్తిగా నిలిచారు. స్వీయ జనగణనలో భాగంగా ఆయన తన వ్యక్తిగత వివరాలతో పాటు, కుటుంబ సభ్యుల సమాచారాన్ని అధికారులకు అందించి నమోదు చేయించుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ వ్యాప్తంగా జనగణన కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు(cm Chandrababu) స్వయంగా పాల్గొని పౌరులందరికీ స్ఫూర్తిగా నిలిచారు. స్వీయ జనగణన(Janaganana)లో భాగంగా ఆయన తన వ్యక్తిగత వివరాలతో పాటు, కుటుంబ సభ్యుల సమాచారాన్ని అధికారులకు అందించి నమోదు చేయించుకున్నారు. రాష్ట్ర ప్రగతికి, భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు ఖచ్చితమైన గణాంకాలు ఎంతో కీలకమని భావించిన సీఎం.. సామాన్యుడిలా ఈ ప్రక్రియలో పాల్గొనడం విశేషం.
ప్రతి ఒక్కరూ నమోదు చేయించుకోవాలి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో జనగణన అనేది ఒక కీలక మైలురాయి అని అభివర్ణించారు. "ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలన్నా, మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నా వాస్తవ గణాంకాలు ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ జనగణనలో భాగస్వాములు కావాలి" అని ఆయన పిలుపునిచ్చారు. అధికారులు అడిగే వివరాలను ప్రజలు నిర్భయంగా, ఖచ్చితంగా వెల్లడించాలని, తద్వారా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని చంద్రబాబు కోరారు.






