రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఇతరులు వెళ్లిపోవాలని ఆదేశం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-10 11:46:20  IST  )

రాష్ట్రంలో పలు జడ్పీటీసీ ఎన్నికలకు ప్రచార సమయం ముగిసింది...

రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఇతరులు వెళ్లిపోవాలని ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పలు జడ్పీటీసీ ఎన్నికల(Zptc Elections)కు ప్రచార సమయం ముగిసింది. పులివెందుల(Pulivendula), ఒంటిమిట్ట(Ontimitta) ఉప ఎన్నికలు ఈ నెల 12న జరగనున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారంలో వైసీపీ, టీడీపీ ఆధిపత్య పోరు చూపించాయి. రెండు పార్టీల ముఖ్య నేతలు సైతం తమ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ప్రచారం చేశారు. ఈ రోజు 5 గంటలకు ఎన్నికల ప్రచార సమయం ముగియడంతో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు జరుగుతున్న చోట్ల ఇతరులెవరూ ఉండొద్దని, కోడ్ అమల్లో ఉందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయొద్దని చెప్పారు. ఈ ఎన్నికలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసేవరకు ఆయా ప్రాంత ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Next Story