ఏపీ కేబినెట్ భేటీ.. కీలక ప్రాజెక్టులకు ఆమోదం

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది..

ఏపీ కేబినెట్ భేటీ.. కీలక ప్రాజెక్టులకు ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. చివరకు పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ల్యాండ్‌ ఇన్సెంటివ్‌ ఫర్‌ టెక్నికల్‌ హబ్స్‌కు కేబినెట్(Cabinet) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జలవనరులశాఖ పనులకు ఆమోదం తెలిపింది. ఆటో(Auto), క్యాబ్‌ డ్రైవర్ల(Cab Drivers)కు రూ.15 వేలు ఇచ్చే ప్రతిపాదనకు మంత్రులు ఆమోదం తెలిపారు. కారవాన్‌ పర్యాటకంతో పాటు అమృత్‌ 2.0 పథకం పనులు, అమరావతిలో పనుల కోసం ఎస్‌పీవీ ఏర్పాటు, పలు సంస్థలకు భూ కేటాయింపులు, 'కుష్టు వ్యాధి' పదం తొలగించే చట్ట సవరణ, విద్యుత్‌ శాఖకు సంబంధించి పలు పనులు సహా కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం ఆమోదం తెలిపింది.

Next Story