- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైల్వే ట్రాక్ పై ఆగిన బస్సు.. స్థానికుల చొరవతో తప్పిన ప్రమాదం
శ్రీ సత్యసాయి జిల్లాలో (Sri Satya Sai District) ఓ పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్ పై ఆగిన (Bus Stopped On Railway Track) బస్సును స్థానికులు పక్కకు తరలించడంతో గండం గట్టెక్కింది.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయి జిల్లాలో (Sri Satya Sai District) ఓ పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్ పై ఆగిన (Bus Stopped On Railway Track) ఆర్టీసీ బస్సును స్థానికులు పక్కకు తరలించడంతో గండం గట్టెక్కింది. సమాచారం మేరకు శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని చెన్నేకొత్తపల్లి మండలం వద్ద ఉదయం వేళ ఈ సంఘటన జరిగింది.
ఎన్ఎస్ గేట్ దగ్గర రైల్వే ట్రాక్ పై ఆకస్మికంగా ఓ ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో బస్సు ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో డ్రైవర్ అప్రమత్తమై అందులో ఉన్నవారిని కిందికి దించివేశాడు. ఇదంతా గమనించిన స్థానికులు వెంటనే బస్సు సమీపంలోకి చేరుకున్నారు. బస్సు డ్రైవరును అడిగి సమస్యను తెలుసుకున్నారు.
బస్సు ప్రమాదకర పరిస్థితిలో రైల్వే ట్రాక్ పై నిలిచిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా దుర్ఘటన జరగక ముందే తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. మరికొంత మందిని తమకు సహాయంగా పిలుచుకున్నారు. తలా ఓ చెయ్యి వేసి బస్సును నెట్టడం ప్రారంభించారు. ఒక్కటై బస్సును బలంగా తొయ్యడంతో అది ముందుకు కదిలింది.
అలా అందరూ కలిసి రైల్వే ట్రాక్ పై ఆగిన బస్సును పట్టాలు దాటించి సురక్షితంగా రోడ్డుకు ఒక పక్కన నిలిపారు. అయితే బస్సు నిలిచిపోయిన సమయంలో ఎటువంటి రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైందని డ్రైవరుతో పాటు స్థానికులు అంటున్నారు. పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు.






