Sri Ram: అట్టహాసంగా మొదలైన ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు

by Thanuru Gopichand |   (  Updated:2025-04-06 04:53:02  IST  )

ఏపీ వ్యాప్తంగా నేడు శ్రీరామ నవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు

Sri Ram: అట్టహాసంగా మొదలైన ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు
X

ఏపీ వ్యాప్తంగా శ్రీరామనమి వేడుకలు

11న స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం

శ్రీరాముని పాలన ఆదర్శనీయం: సీఎం చంద్రబాబు

దిశ, డైనమిక్ ​బ్యూరో: ఏపీ వ్యాప్తంగా నేడు శ్రీరామ నవమి వేడుకలు (Sriramanavami) భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. చలువ పందిళ్లు వేసి స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్నారు. కడప జిల్లాలో ఒంటిమిట్ట (Ontimitta) కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 15 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11న సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు (Cm Chandrababu) ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. పాలకుడు ఎప్పుడూ ప్రజలకు ఆదర్శనీయుడుగా ఉండాలని తన పాలన ద్వారా శ్రీరాముడు తెలియజేశాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.ప్రజల మాటకు విలువనిచ్చిన పాలనతో శ్రీరాముడు ఆనాడే ప్రజాస్వామ్య ప్రాధాన్యతను తెలియజేశాడని పేర్కొన్నారు. వాడవాడలా జరిగే నవమి వేడుకలు గ్రామాల్లో కొత్త శోభను ఆవిష్కరించాలని కోరుకుంటున్నాను. ఆ సీతారాముల దయతో మీ ఇంటిల్లిపాది ఆనంద ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

అతా సుభిక్షంగా ఉండాలి..: పవన్​కల్యాణ్​

శ్రీరామనవమిని పురస్కరించుకుని డిప్యూటీ సీఎం పవన్​కల్యాణ్​ ప్రజలందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముని కరుణ, కటాక్షం ప్రతీ ఒక్కరిపై ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, సమస్త జీవరాశులు సుభిక్షంగా ఉండాలని శ్రీ రామచంద్ర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు: లోకేశ్​

ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు అని మంత్రి నారా లోకేశ్​పేర్కొన్నారు. పట్టాభిషిక్తుడిగా ప్రజలకు ఆదర్శంగా నిలిచాడని గుర్తు చేశారు. ధర్మమార్గంలో నడిచినవారికి శ్రీరాముడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఈ శ్రీరామ నవమి అందరికీ సుఖసంతోషాలను, ఆరోగ్యాన్ని అందించాలని.. శ్రీరామ చంద్రమూర్తి దయ మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.

సకల గుణ సంపన్నుడు శ్రీరాముడు : వైఎస్ ​జగన్​

రామ‌చంద్రుడికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఏనాడూ ధర్మం వీడలేదు. అబద్ధం ఆడలేదని మాజీ సీఎం వైఎస్​జగన్​పేర్కొన్నారు. ప్రజారంజక పాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆద‌ర్శనీయం అన్నారు. ఆ జానకీ వల్లభుడి ఆశీస్సులు తెలుగు ప్రజలందరిపై సదా ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు

Next Story