- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోస్టుమార్టం పూర్తి.. స్వస్థలాలకు కాశీబుగ్గ మృతదేహాలు
తొక్కిసలాట మృతులకు పోస్టుమార్టం పూర్తి కావడంతో మృతదేహాలను స్వస్థలాలకు తరలిస్తున్నారు..

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి(Kasibugga Venkateswaraswamy) ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే 9 మంది మృతదేహాలకు పలాస ప్రభుత్వ ఆస్పత్రి(Palasa Government Hospital)లో పోస్టుమారం పూర్తి అయింది.
అనంతరం ప్రత్యేక అంబులెన్సుల్లో స్వస్థలాలకు మృతదేహాలను తరలిస్తున్నారు. కాశీబుగ్గ తొక్కిసలాటలో బాలుడు సహా 9 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ప్రస్తుతం వీరికి చికిత్స అందించారు. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం.. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతి చెందిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు అందజేస్తామని స్పష్టం చేశారు.
Next Story






