ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ ఎంపీ గురుమూర్తి పిల్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ..పెట్టుబడులే లక్ష్యంగాపలు కంపెనీలకు భూములు కేటాయిస్తోంది.

ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ ఎంపీ గురుమూర్తి పిల్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం(Kutami Government) తీవ్రంగా కృషి చేస్తోంది. పెట్టుబడులే(Investments) లక్ష్యంగాపలు కంపెనీల(Companies)కు భూములు(Lands) కేటాయిస్తోంది. అయితే తక్కువ ధరకే భూముల కేటాయించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు(Ysr Congress Leaders) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైసీపీ ఎంపీ గురుమూర్తి(Ycp Mp Gurumurthy) హైకోర్టు(High Court)లో పిల్ దాఖలు చేశారు. దీంతో ఈ పిల్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విభజన తర్వాత ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిందని గుర్తు చేసింది. కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం యత్నిస్తోందని, ప్రోత్సాహకాలు లేకుండా పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించింది. సంస్థలకు భూకేటాయింపులను ఒక అంశంగా మాత్రమే చూడాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. కేటాయింపులతో రానున్న రోజుల్లో విస్తృత ప్రయోజనాలు ఉంటాయని సూచించింది.

ప్రభుత్వ పాలసీలతో మరో 200 ఏళ్లు ప్రయోజనాలుంటాయని తెలిపింది. భూకేటాయింపుల్లో ప్రభుత్వ విధానాన్ని విస్తృత కోణంలో చూడాలని చెప్పింది. వేలం ద్వారా కంపెనీలకు భూకేటాయింపులతో ఫలితాలు రాకపోవచ్చని అంచనా వేసింది. ఏపీ అభివృద్ధి చెందాలంటే భారీ స్థాయిలో పారిశ్రామికీకరణ జరగాలని సూచించింది. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు రావాలని చెప్పింది. మార్కెట్ ధరకు భూములిస్తే కంపెనీలు అనుకూల ప్రాంతాలకు వెళ్లే ప్రమాదముందని హెచ్చరించింది. ప్రభుత్వ పాలసీలతో పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని ఏ కంపెనీ కోర్టుకు రాలేదు కదా అని ప్రశ్నించింది. ప్రభుత్వ పాలసీని సవాల్‌ చేస్తూ రాజకీయ నేత కోర్టుకొచ్చారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Next Story