అదుపుతప్పి ఆటో బోల్తా.. 10 మంది కూలీలు ఆసుపత్రి పాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-18 08:03:57  IST  )

మార్కాపురం జిల్లా కొమరోలు మండలం ఇడమకల్లు సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది..

అదుపుతప్పి ఆటో బోల్తా.. 10 మంది కూలీలు ఆసుపత్రి పాలు
X

దిశ, వెబ్ డెస్క్: మార్కాపురం జిల్లా(Markapuram District) కొమరోలు మండలం(Komarolu Mandal) ఇడమకల్లు (Idamakallu)సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో(Auto) ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 10 మందికి పైగా కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను స్థానికులు 108 వాహనాల ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

కూలీ పనులకు వెళ్తుండగా ప్రమాదం

బాధితులంతా కొమరోలు, సర్విరెడ్డిపల్లె గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. కూలీ పనులకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story