- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అటెండర్ ఆస్తి విలువ రూ.కోటి
విశాఖపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు అటెండర్ ఆస్తి చూసి అవినీతి నిరోధకశాఖ అధికారులు నోరెళ్లబెట్టారు.

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు అటెండర్ ఆస్తి చూసి అవినీతి నిరోధకశాఖ అధికారులు నోరెళ్లబెట్టారు. అయితే గతనెల విశాఖ సూపర్ బజార్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ చేపట్టిన తనిఖీలకు సంబంధించిన దర్యాప్తును మరోసారి కొనసాగించింది. ఈ దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూపర్‌బజార్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న బి. ఆనంద్‌కుమార్ ఇంట్లో సుమారు రూ.కోటి విలువైన ఆస్తులను గుర్తించారు. అదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న త్రిపురగిరి సుధారాణి ఇంట్లో కూడా దాదాపు రూ.కోటి విలువైన స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే సబ్‌రిజిస్ట్రార్ మోహనరావు ఇంట్లో స్థిరాస్తులు, మోటారు వాహనాలకు సంబంధించిన పలు కీలక ఆస్తి పత్రాలు లభ్యమయ్యాయి. రోజంతా సాగిన ఈ తనిఖీల్లో కొంత నగదు, బంగారు ఆభరణాలతో పాటు అనేక ముఖ్యమైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుని దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.






