- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పల్నాడులో దారుణం.. అనుమానంతో భార్య కాలు నరికేసిన భర్త..!
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో దారుణం జరిగింది. అనుమానంతో గొడ్డలితో భార్య భూలక్ష్మి కాలు నరికిన భర్త లక్ష్మయ్య దాన్ని భూలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రికి చికిత్స పొందుతున్నారు...

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu District) ముప్పాళ్ల మండలం(Muppalla Mandalam)తొండపి(Tondapi)లో దారుణం జరిగింది. అనుమానంతో భార్య కాలును గొడ్డలితో భర్త నరికారు. దీంతో భార్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భర్త లక్ష్మయ్య కొంతకాలంగా భార్యపై అనుమానంతో గొడవ పడుతున్నారు. ఈ క్రమంలోనే గొడవ మరింత పెద్దగా కావడంతో భర్త ఆవేశంతో ఊగిపోయారు. ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్యపై దాడి చేశాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసినా లక్ష్మయ్య కర్కశంగా వ్యవహరించారు. భార్య భూలక్ష్మి కాలుపై వేటు వేయడంతో కాలు తెగిపడింది. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న బాధితురాలి ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే భార్య కాలును గోనె సంచిలో వేసుకుని నిందితుడు లక్ష్మయ్య పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.






