భర్తను చంపి ప్రమాదంగా చిత్రీకరించిన భార్య.. విచారణలో బయటపడిన అసలు విషయం

by Vemula.Srinu Prasad |

నెల్లూరు జిల్లా శెట్టిగుంటలో దారుణం జరిగింది......

భర్తను చంపి ప్రమాదంగా చిత్రీకరించిన భార్య.. విచారణలో బయటపడిన అసలు విషయం
X

దిశ, వెబ్ డెస్క్: మద్యం తాగి వచ్చి తరచూ పడుతున్న గొడవపడుతున్న భర్తను క్షణికావేశంలో భార్య హత మార్చారు. అయితే ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది భార్య. కానీ పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో నిందితురాలు జైలు పాలయ్యారు.

శెట్టిగుంటకు చెందిన శ్రీనివాస్ కుమార్‌కు, ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన లక్ష్మీప్రసన్నకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే శ్రీనివాస్ కుమార్ తాగుడుకు బానిసయ్యారు. నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవారు. రోజూ మాదిరి ఆదివారం కూడా శ్రీనివాస్ కుమార్, లక్ష్మీప్రసన్న మధ్య గొడవ జరిగింది. అయితే ఈ గొడవలో భర్త శ్రీనివాస్ కుమార్‌ను భార్య లక్ష్మీ ప్రసన్న కత్తితో పొడిచారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఘటనా స్థలంలోని రక్తపు మరకలను ఆమె తుడిచేశారు. శ్రీనివాస్ కుమార్ మెట్లమీద నుంచి కాలు జారి పడి మృతి చెందారని భార్య లక్ష్మీ ప్రసన్నచెప్పారు.

అయితే పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. తనే భర్తను చంపినట్లు భార్య లక్ష్మీ ప్రసన్న ఒప్పుకున్నారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Next Story