- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలేజీ హాస్టల్‌లో దారుణం.. విద్యార్థిని చితకబాదిన తోటి విద్యార్థులు
చిత్తూరు జిల్లా సత్యవీడులో దారుణం జరిగింది...

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా సత్యవీడు(Satyaveedu)లో దారుణం జరిగింది. స్థానిక సిద్ధార్థ కాలేజీ హాస్టల్(Siddhartha College Hostel)లో ర్యాగింగ్(Raging) భూతం కలకలం రేపింది. విద్యార్థిని తోటి విద్యార్థులు(Students) చితకబాదారు. కాళ్లతో తన్నుతూ విచక్షణారహితంగా దాడి చేశారు. క్షమించమని అడిగినా ఆగలేదు. పదే పదే కొట్టారు. మరో విద్యార్థి ఆగమని చెబుతున్నా రెచ్చిపోయి మరీ దాడి చేశారు. అంతేకాదు ఈ దృశ్యాలు వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కాలేజీ నిర్వహకులపై వ్యతిరేకత పెరుగుతోంది. కాలేజీలో ఇంతలా ర్యాగింగ్ జరుగుతున్నా ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దాడికి గురైన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదారుగురు విద్యార్థులు తమ కుమారుడిపై దాడి చేశారని, వారందరినీ కాలేజీ నుంచి బహిష్కరించాలని కోరుతున్నారు.






