- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్రపు డెక్కలో మృతదేహం.. రెండు రోజుల తర్వాత లభ్యం
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో దారుణం జరిగింది..

X
దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) సామర్లకోట(Samarlakota) భీమేశ్వరాలయం వద్ద ప్రమాదవశాత్తు లావరాజు అనే వ్యక్తి మృతి చెందారు. స్థానిక గోదావరి కాలువలో గుర్రపు డెక్కను తొలగించేందుకు లోవరాజు ప్రయత్నం చేశారు. అయితే కాలు జారీ గోదావరి కాలువలో పడ్డారు. కొద్దిసేపటికి కాలువ నీటిలో కొట్టుకుపోయారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది. అప్పటి నుంచి లోవరాజు మృతదేహం కోసం స్థానికులు గోదావరి కాలువలో గాలించారు. రెండు రోజులుగా ఆచూకీ లభ్యంకాలేదు. ప్రమాదం జరిగిన చోటే ఆదివారం మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






