వైసీపీ కార్యకర్త దారుణహత్య... జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

by Vemula.Srinu Prasad |

శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది....

వైసీపీ కార్యకర్త దారుణహత్య... జగన్ స్ట్రాంగ్ రియాక్షన్
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీసత్యసాయి జిల్లా(Sri Sathya Sai District) రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి(PapireddyPalli)లో దారుణం జరిగింది. వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) శ్రేణులు ఘర్షణకు దిగారు. రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో వైసీపీ కార్యకర్త లింగమయ్య(YSRCP activist Lingamayya) తలకు బలంగా దెబ్బ తగలడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో లింగమయ్య మృతి చెందారు.

దీంతో వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యను ఆ పార్టీ అధినేత జగన్‌( Ycp Chief Jagan) ఖండించారు. లింగమయ్యను TDP నేతలు పొట్టనపెట్టుకున్నారని, అన్యాయాలను ప్రశ్నించినందుకే హత్య జరిగిందన్నారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు పరిపాటిగా మారాయని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వ్యాఖ్యానించారు. లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు.

Next Story