భార్య ఆత్మహత్య.. కొద్దిసేపటికే భర్త ఆత్మహత్యాయత్నం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-19 16:37:41  IST  )

కాకినాడ జిల్లా మండపేటలో దారుణం జరిగింది...

భార్య ఆత్మహత్య.. కొద్దిసేపటికే భర్త ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా మండపేట(Mandapet)లో దారుణం జరిగింది. అనుమానాస్పద స్థితిలో వివాహిత(Married) భారతి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే భార్య(Wife) చనిపోయిన కొద్దిసేపటికే భర్త(Husband) ఫణీంద్ర సైతం ఆత్మహత్యయత్నం(Suicide Attempt) చేశారు. రైలు కింద పడి చనిపోయేందుకు యత్నించారు. రైల్వే సిబ్బంది గమనించి ఫణీంద్రను రక్షించారు. అయితే తమ కూతురు భారతి ఆత్మహత్యకు భర్త ఫణీంద్ర వేధింపులే కారణమని భారతి బంధువులు ఆరోపిస్తున్నారు. మండపేటలకు చెందిన ఫణీంద్రకు, భారతికి 2012లో వివాహం జరిగింది. కొద్ది రోజులు ఫణీంద్ర బాగానే ఉన్నా ఆ తర్వాత మద్యానికి బానిసయ్యారు. అప్పటి నుంచి ప్రతి రోజే తమ కూతురిని ఫణీంద్ర వేధించేవాడని, ఈ మధ్య కాలంలో అవి మరింత ఎక్కువయ్యాయని, అందువల్లే భారతి ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story