దారుణం...మహిళను హత్యచేసి తగలబెట్టిన దుండగులు

by Vemula.Srinu Prasad |

నెల్లూరు జిల్లా జొన్నవాడ సమీపంలో దారుణ ఘటన వెలుగుచూసింది. రోడ్డు పక్కన ఒక మహిళా మృతదేహం మంటల్లో కాలిపోతూ స్థానికుల కంటపడింది...

దారుణం...మహిళను హత్యచేసి తగలబెట్టిన దుండగులు
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా జొన్నవాడ సమీపంలో దారుణ ఘటన వెలుగుచూసింది. రోడ్డు పక్కన ఒక మహిళా మృతదేహం మంటల్లో కాలిపోతూ స్థానికుల కంటపడింది. ఈ ఘోర కలిని చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు చేరవేశారు.

ఆధారాలు లభించకుండా..

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కాలిపోతుండటంతో, గుర్తుపట్టడానికి వీల్లేకుండా మారింది. గుర్తుతెలియని దుండగులు ఆ మహిళను మరెక్కడైనా హత్య చేసి, ఆపై ఆధారాలు లభించకుండా ఉండేందుకు ఇక్కడికి తీసుకువచ్చి తగలబెట్టి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

రంగంలోకి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి ఆధారాలు సేకరిస్తున్నారు. మృతురాలు ఎవరు? ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల మిస్సైన మహిళల వివరాలను సేకరిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story