విజయవాడలో ఘనంగా ‘‘అష్టబంధన మహాసంప్రోక్షణ”

by Vemula.Srinu Prasad |

విజయవాడ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ‘‘అష్టబంధన మహాసంప్రోక్షణ” కార్యక్రమం ముగిసింది..

విజయవాడలో ఘనంగా ‘‘అష్టబంధన మహాసంప్రోక్షణ”
X

దిశ, వెబ్ డెస్క్: ఐదు రోజులుగా విజయవాడ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ‘‘అష్టబంధన మహాసంప్రోక్షణ” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ మహాసంప్రోక్షణ గురువారం ఘనంగా ముగిసింది. ఈ రోజు ఉదయం 7.30 గంట‌లకు మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఉదయం 11.25 గంట‌లకు తులాలగ్నంలో కళావాహనం, ప్రథమ కాలార్చనము, మహా సంప్రోక్షణ, అక్షతారోహణ, బ్రహ్మ ఘోష తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత భ‌క్తుల‌కు స్వామి ద‌ర్శనం క‌ల్పించారు.

Next Story