- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయసాయి తీరు, చరిత్ర, నిజాలు త్వరలో బయటపెడతా: రాజ్ కసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ లిక్కర్ స్కాం కేసు రాష్ట్రంలో సంచలనంగా మారింది..

దిశ, వెబ్ డెస్క్: కొద్ది రోజులుగా ఏపీ లిక్కర్ స్కాం కేసు(AP Liquor Scam Case) రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy) ఉండగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Former MP Vijayasai Reddy)పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు ఇద్దరికీ నోటీసులు జారీ చేశారు. అయితే సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. రాజ్ కసిరెడ్డి మాత్రం పరారీలోనే ఉన్నారు. దీంతో కసిరెడ్డిపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో సూత్రధారి కసిరెడ్డినేనని చెప్పారు. కసిరెడ్డిని వచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు.
దీంతో రాజ్ కసిరెడ్డి శనివారం మధ్యాహ్నం స్పందించారు. కేసుకు సంబంధించి ఓ ఆడియోను విడుదల చేశారు. సిట్ విచారణకు తాను సహకరిస్తానని తెలిపారు. ఈ కేసు విషయంలో జరిగిన పరిణామాలను ఆడియోలో వివరించారు. అలాగే విజయసాయిరెడ్డి వ్యవహారంపైనా కసిరెడ్డి రెస్పాండ్ అయ్యారు. విజయసాయి తీరు, చరిత్ర, నిజాలు త్వరలో బయటపెడతానని హెచ్చరించారు. విజయసాయిరెడ్డి చెప్పేదంతా అసత్యాలు తప్పులేనని చెప్పారు. ఆయన చెప్పేది విని అదే నిజమని అనుకోవద్దన్నారు. అన్ని విషయాలు వెల్లడిస్తానని రాజ్ కసిరెడ్డి పేర్కొన్నారు.






