- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటి తమన్నా, ఎమ్మెల్సీ కవితతో మద్యం కేసు నిందితుడు.. ఫొటోలు వైరల్
ఏపీ మద్యం కేసు సంచలనంగా మారింది..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మద్యం కేసు(AP liquor case) సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే నిందితులను సిట్ అధికారులు జైలుకు పంపారు. అయితే నిందితుడు వెంకటేశ్ నాయుడుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నటి తమన్నాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఫొటోలు దిగారు. అంతేకాదు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరుతో యాడ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఆమె అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదల అయ్యారు. దీంతో ఏపీ లిక్కర్ కేసుకు ముడిపెడుతూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పైగా కవితతో వెంకటేశ్ నాయుడు దిగిన ఫొటోలు చక్కెర్లు కొట్టడం ఈ కామెంట్స్‌కు మరింత బలానిస్తున్నాయి.
అలాగే వెంకటేశ్ నాయుడు ఫ్లైటుల్లో తిరుగుతూ లగ్జరీగా గడపటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి, ఆ డబ్బులతో వెంకటేశ్ నాయుడు ఎంజాయ్ చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటువంటి వారిని కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
వీడియో 1






