ట్రాఫిక్ పోలీసులపై.. ఏపీ హైకోర్ట్ ఆగ్రహం!

by Geesa Chandu |

వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలనే నిబంధన అమలులోని జాప్యం కారణంగా.. ట్రాఫిక్ పోలీసులపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ట్రాఫిక్ పోలీసులపై.. ఏపీ హైకోర్ట్ ఆగ్రహం!
X

దిశ, వెబ్ డెస్క్: వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలనే నిబంధన అమలులోని జాప్యం కారణంగా.. ట్రాఫిక్ పోలీసులపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చాలా మంది వాహనదారులు హెల్మెట్ ధరించట్లేరని న్యాయస్థానం తెలిపింది. ట్రాఫిక్ నిబంధనలను అమలుచేయడంలో పోలీసులు విఫలమవుతున్నారని కోర్టు మండిపడింది. మోటార్ వాహన చట్ట నిబంధనలు అందరూ పాటించేలా ఆదేశించాలని కోరుతూ.. న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిల్ పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించడానికి ఎలక్ట్రానిక్ విజిలెన్స్ ఉండాలని న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదనంతరం పోలీసులను పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Next Story