జలసౌథలో కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ.. రాలేమని చివరి నిమిషంలో లేఖ రాసిన ఏపీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-05 06:53:10  IST  )

కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశానికి రాలేమని ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది..

జలసౌథలో కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ.. రాలేమని చివరి నిమిషంలో లేఖ రాసిన ఏపీ
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా నది జలాల(Krishna River Water) విషయంలో ఏపీ(Ap), తెలంగాణ(Telangana) మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ(KRMB Three-Member Committee) ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ జలసౌథ(Hyderabad waterworks)లో రెండు రాష్ట్రాల ఇంజినీర్లు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరుకావాలని రెండు రాష్ట్రాల అధికారులకు పిలుపునిచ్చింది.

అయితే జలసౌథలో త్రిసభ్య కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ఈఎన్సీ అనిల్ కుమార్ (Telangana ENC Anil Kumar)హాజరయ్యారు. అయితే ఏపీ నుంచి అధికారులు హాజరుకాలేదు. తాము రాలేమని కేఆర్ఎంబీ(KRMB)కి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) పరిశీలనకు నిపుణులు వస్తారని లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 10న భేటీ ఏర్పాటు చేయాలని ఏపీ ఈఎన్‌సీ కోరింది. అలాగే కేఆర్ఎంబీ సమావేశాలు విజయవాడలో పెట్టాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Next Story