పేదలకు గుడ్ న్యూస్.. త్వరలో ఇంటి స్థలాలు

by Vemula.Srinu Prasad |

ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టనుంది...

పేదలకు గుడ్ న్యూస్.. త్వరలో ఇంటి స్థలాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం(Kutami Government) మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టనుంది. పేదలందరికీ ఇళ్ల పట్టాలు(Hous Rails) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని ఇప్పటికే మంత్రులు ప్రకటించారు. తాజాగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు(Mla Pattipati Pullarao) కూడా ఇదే ప్రకటన చేశారు. చిలకలూరిపేట(Chilakaluripet)లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రానికి, ప్రజలకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) శ్రీరామరక్ష అని చెప్పారు. సంవత్సరంలో రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి బాట పట్టించారని తెలిపారు. అరాచకాలు, దుర్మార్గాలు చేయడం వల్లే గత పాలకులను ఇంటికి సాగనంపారని పేర్కొన్నారు. పేదలకు తమ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి స్థలాలు ఇవ్వడం జరుగుతుందని ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.

Next Story