గుడ్ న్యూస్.. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కసరత్తులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-05 10:39:57  IST  )

ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగువేయబోతోంది....

గుడ్ న్యూస్.. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కసరత్తులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం(Ap Government) మరో కీలక అడుగువేయబోతోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు(New District), రెవెన్యూ డివిజన్లు(Revenue Divisions) ఏర్పాటుపై కసరత్తులు ప్రారంభించింది. ఈ అంశంపై ఇప్పటికే మంత్రి వర్గ ఉపసంఘం(Cabinet Subcommittee) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియపై ఇప్పుడు వేగం పెంచింది. రాష్ట్ర రాజధాని అమరావతి(Amaravati)లోని సచివాలయం(Secratariat)లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చించింది. ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు నాయుడుతోనూ చర్చించింది. పలు మండలాలు, గ్రామ సరిహద్దుల విషయంలోని అభ్యంతరాలపైనా సమావేశంలో చర్చించారు. త్వరలోనే ఆమోద ముద్ర వేసి ఈ ఏడాది చివరి నాటికి ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.

Next Story