మేం వ్యతిరేకం: సజ్జల సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |

అమరావతి రాజధాని చట్టబద్ధతపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కేబినెట్ నిర్ణయించింది..

మేం వ్యతిరేకం: సజ్జల సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) రాజధాని చట్టబద్ధతపై ఏపీ ప్రభుత్వం(Ap Government) కీలక అడుగులు వేసింది. అసెంబ్లీ(Assembly)లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కేబినెట్(Cabinet) నిర్ణయించింది. ఈ మేరకు సీఎం అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించి రాజధాని చట్టబద్ధతపై మంత్రులు తీర్మానం చేశారు. 28న జరిగే అసెంబ్లీతో పాటు మండలిలోనూ చర్చించి కేంద్రప్రభుత్వానికి పంపనున్నారు.

అయితే రాజధాని చట్టబద్ధతపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(YCP General Secretary Sajjala Ramakrishna Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి చట్టబద్ధతపై అసెంబ్లీలో తీర్మానం చేసే అవసరం ఏం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. చట్టబద్ధత చేయాలంటే మండలి కూడా సమావేశం కావాలని సూచించారు. అమరావతిలో అవినీతి యజ్ఞం చేస్తునారని పేర్కొన్నారు. అమరావతి టెండర్ల వ్యవహారం గోప్యంగా ఉంచారని, అవినీతిని ప్రశ్నిస్తే రాజధానికి వ్యతిరేకమంటున్నారని చెప్పారు. అమరావతిలో జరిగే అవినీతికి తాము వ్యతిరేకమని సజ్జల స్పష్టం చేశారు.

Next Story