ఏపీ మళ్లీ అప్పు.. ఈసారి ఎంతంటే..?

by Vemula.Srinu Prasad |

ఆర్బీఐ వద్ద ఏపీ ప్రభుత్వం మరోసారి అప్పు చేసింది..

ఏపీ మళ్లీ అప్పు.. ఈసారి ఎంతంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం(Ap Government) మరోసారి అప్పు చేసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణతో అప్పులు(Debts) వెంటొచ్చిన విషయం తెలిసిందే. అయితే పాలన కొనసాగాలంటే అప్పులు తప్పనిసరి అయింది. అప్పటి నుంచి టీడీపీ(Tdp), వైసీపీ(Ycp) ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించాయి. అయితే గత పదేళ్లు అప్పులతో ఆ పార్టీలు నెట్టుకొచ్చాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పులపై పరస్పరం విమర్శలు చేసుకున్నాయి.

సేమ్ టు సేమ్

ఇదిలా ఉంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనూ అప్పులు కొనసాగుతున్నాయి. పాలన సాగించడానికి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలుమార్లు అప్పులు తీసుకున్న ప్రభుత్వం తాజాగా సైతం అదే పదే పని చేసింది. మరో 6, 500 కోట్లు కొత్తగా అప్పుతీసుకుంది. ఈ అప్పు కోసం ప్రభుత్వం ఆర్బీఐ వద్ద ఇండెంట్ పెట్టింది. గత18 నెలల్లోనే రూ.2.93 లక్షల కోట్లకు పైగా అప్పులు ప్రభుత్వం చేసింది. దీంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. విభజన జరిగి పదేళ్ల దాటినా రాష్ట్రం ఇంకా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం దారుణమని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఇకనైనా రాష్ట్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని సలహా ఇస్తున్నారు.

Next Story