- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేసవిపై బిగ్ అలర్ట్.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
వేసవి కాలంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ సారి ఎండలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేసింది...

దిశ, వెబ్ డెస్క్: వేసవి కాలం(Summer)పై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ సారి ఎండలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేసింది. ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్యారోగ్యం, సంజీవని ప్రాజెక్టు(Medical and Health, Sanjeevani Project)పై కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు(Cm Chandrababu) వడగాలుల విషయంలో ముందుగానే ప్రచారం చేపట్టాలని సూచించారు. ఎండలో పని చేసే ఉపాధి హామీ కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వడగాలుల వల్ల ఒక్క మరణం కూడా జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. పశువులకు నీటితొట్టెలను పెద్దఎత్తున నిర్మించామని తెలిపారు. నీటి తొట్టెల్లో నీళ్లు నింపేలా చర్యలు తీసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుంచి పశు బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. వైద్యారోగ్యం, సంజీవని ప్రాజెక్టు తక్కువ వ్యయంతో పోర్టబుల్‌గా ఉండేలా మెడ్ టెక్ టూల్స్ తయారు చేయాలని, చెప్పారు. ఆర్టీఐహెచ్ ద్వారా మరిన్ని ఆవిష్కరణలు చేసి ప్రజారోగ్యం కోసం వినియోగిద్దామని అధికారులకు సీఎం పిలుపునిచ్చారు.






