- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ వాళ్లు రాకుండా చూడండి: తమిళనాడు సీఎంకు చంద్రబాబు లేఖ
తమిళనాడుకు చెందిన మత్స్యకార పడవలు ఏపీ సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించడంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ..

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు(Tamilanadu)కు చెందిన మత్స్యకార(Fisherman) పడవలు ఏపీ సముద్ర జలాల్లోకి(AP Sea Waters ) అక్రమంగా ప్రవేశించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ అక్రమ చొరబాటుపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్(Tamil Nadu CM M.K. Stalin)తో పాటు కేంద్ర ప్రభుత్వానికి సైతం సీఎం చంద్రబాబు(Cm Chandrababu) లేఖలు రాశారు. సరిహద్దు దాటి రాష్ట్రంలోకి పడవలు వస్తున్నాయని, తద్వారా స్థానిక జలాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని తెలిపారు. దీన్ని అరికట్టేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు.
తమిళ మత్యకారుల చొరబాటుతో..
తమిళనాడు మత్స్యకారుల చొరబాటు వల్ల ఏపీలోని దాదాపు 162 తీర ప్రాంత గ్రామాలకు చెందిన మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. తమిళనాడు పడవలు నిబంధనలకు విరుద్ధమని, అలా రావడంతో స్థానిక మత్స్యకారుల వేటకు ఆటంకం కలుగుతోందని, అంతేకాకుండా వారి జీవనోపాధికి సైతం ముప్పు వాటిల్లుతోందని లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల తీర ప్రాంతంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని చంద్రబాబు హెచ్చరించారు. సముద్ర జలాల్లో అక్రమ ప్రవేశాలను అడ్డుకోవాలని, ఇందుకోసం రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు. తమ మత్స్యకారులకు సరిహద్దు నిబంధనలపై తమిళనాడు ప్రభుత్వం అవగాహన కల్పించాలని సూచించారు.






