మహిళా ఖైదీల పిల్లలకోసం జైలులో అంగన్ వాడీలు.... రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-23 11:19:58  IST  )

జైళ్లు, సంస్కరణల బిల్లుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఖైదీలకు క్షమాభిక్ష కల్పించేందుకు సానుకూలంగా ఉన్నట్లు ప్రకటించింది....

మహిళా ఖైదీల పిల్లలకోసం జైలులో అంగన్ వాడీలు....  రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్: జైళ్లు, సంస్కరణల బిల్లు(Prisons, Reforms Bill)కు ఏపీ ప్రభుత్వం(Ap Government) ఆమోదం తెలిపింది. ఖైదీలకు క్షమాభిక్ష కల్పించేందుకు సానుకూలంగా ఉన్నట్లు ప్రకటించింది. కేంద్రం చట్టం మేరకు సంస్కరణలు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇదే విషయంపై అసెంబ్లీ(Assembly)లో హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) మాట్లాడుతూ ఖైదీల సంస్కరణలకు చర్యలు ప్రారంభమైనట్లు తెలిపారు. మహిళా ఖైదీల పిల్లలకోసం జైలులో అంగన్‌వాడీలు ఏర్పాటు చేస్తామని అనిత చెప్పారు. ఖైదీలు జైలులో ఉండి చదువుకునేలా అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు. ఖైదీల పరివర్తన తీసుకురావటం కోసం చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఖైదీల నేరచరిత్ర, ప్రవర్తన ఆధారంగా కేటగిరీలుగా విభజిస్తామని చెప్పారు. వ్యవసాయంతో పాటు ఇతర వృత్తులు కూడా ఖైదీలు నిర్వహించేలా జైలులో చేపడతామని తెలిపారు. ఖైదీల పరివర్తనల్లో మార్పు తెచ్చేలా ఓపెన్ ఎయిర్ జైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వంగలపూడి అనిత పేర్కొన్నారు.

Next Story