- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ నీటిని తీసుకోవడంలేదు.. కేంద్ర ఆర్థిక శాఖకు ప్రజెంటేషన్
తెలంగాణ నీటిని తీసుకోవడంలేదని కేంద్ర ఆర్థిక శాఖకు ఏపీ ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇచ్చింది....

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap), తెలంగాణ(Telangana) మధ్య నీళ్ల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. కృష్ణా(Krishna), గోదావరి రివర్(Godavari River) బోర్డుల ఎదుట తమ వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువగా వాడుకుంటోందని, తమకు నష్టం కలుగుతోందని తెలంగాణ ఆరోపిస్తోంది. తమకు కేటాయించిన నీటినే వాడుకుంటున్నామని ఏపీ బదులిస్తోంది.
అయితే ఏపీ జిల్లాలకు నీటి సమస్యను తీర్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు(Polavaram-Banakacharla Project) చేపట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, అనుమతులపై కేంద్రాన్ని కోరారు. బనకచర్ల ప్రాజెక్టుకు రూ.81 వేల కోట్లు అవుతుందని అంచనాల ప్రతిపాదనలను కేంద్రానికి అందజేశారు. అయితే తాజాగా జరిగిన కేంద్ర ఆర్థిక శాఖతో సమావేశంలోనూ బనకచర్ల ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు ప్రయోజనాలు, భూసేకరణపై రాష్ట్ర ఆర్థిక, నీటిపారుదల శాఖల అధికారులు రెండు గంటల పాటు వివరించారు. ప్రాజెక్టు అంచనాలు, ప్రతిపాదనల వివరాల రిపోర్టును అందజేశారు. ప్రాజెక్టుకు రూ.81 వేల కోట్లు అవుతుందని ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే ప్రజలు, రైతులకు కలిగే ప్రయోజనాలనూ వివరించారు. భవిష్యత్తులో స్వీయ ఆర్థిక ప్రాజెక్టుగా బనకచర్ల ఉంటుందని తెలిపారు. ఇదే విషయాన్ని గత నెలలోనే ప్రధాని మోడీకి సైతం వివరించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ లేవనెత్తుత్తున్న అంశాలపైనా సమాధానం ఇచ్చారు. సుమారు 2 వేల టీఎంసీల వృధా నీటిని వాడుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. బనకచర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని వివరించారు. తెలంగాణ నీటిని తామేమీ తీసుకోవడంలేదని ఇప్పటికే సీఎం చంద్రబాబు సైతం కేంద్ర ఆర్థిక శాఖకు వివరించారు.






