- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలపై చర్చ
ఏపీ మంత్రి మండలి గురువారం భేటీ కానుంది. ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో క్యాబినేట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఖరారు చేస్తూ మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేయనున్నారు...

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ మంత్రి మండలి గురువారం భేటీ కానుంది. ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో క్యాబినేట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఖరారు చేస్తూ మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. కేంద్రం ప్రభుత్వం సూచనతో ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ నిర్వహించాలని ప్రాధమిక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీతో పాటు కేంద్రానికి పంపే తీర్మానం కు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో వివిధ రంగాలపై యుద్ద ప్రభావంపై ప్రత్యేకంగా శాఖల వారీగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడనున్నారు. ఇప్పటికే గ్యాస్ కొరతతో పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల హోటల్స్ మూసివేసిన పరిస్థితి నెలకొంది.ఎల్ పీ జీ నుండి పిఎన్ జీ గా మార్చే అంశంపై కేబినెట్‌లో సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.గ్యాస్ సిలిండర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం పై మంత్రి మండలి చర్చించనుంది.






