ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 18 బిల్లులకు ఆమోదం

by Vemula.Srinu Prasad |

ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. మొత్తం 15 రోజులపాటు 72 గంటల 14 నిమిషాలపాటు సమావేశాలు జరిగాయి..

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 18 బిల్లులకు ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ(AP Assembly) నిరవధికంగా వాయిదా(Adjournment) పడింది. మొత్తం 15 రోజులపాటు 72 గంటల 14 నిమిషాలపాటు సమావేశాలు జరిగాయి. 122 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మొత్తం 80 ప్రశ్నలకు సభాసమక్షంలో ఉంచారు. ఈసారి సమావేశాల్లో 18 బిల్లులు ఏకగ్రీవంగా సభ్యులు ఆమోదించారు. 166 పాఠశాలల నుంచి 6,693 విద్యార్థులు ఈ సమావేశాల్లో అసెంబ్లీని సందర్శించారు. 16వ శాసనసభ ఐదో సమావేశాలుగా కొనసాగాయి. ఇక సభ వాయిదా అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు జరిగేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాయంత్రం ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయని, ప్రతిఒక్కరూ కుటుంబసమేతంగా రావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు విజ్ఞప్తి చేశారు.

Next Story