- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా అమరావతి రైతు సోదరుల కోసం అడుగుతున్నా.. లాభం ఏమిటి?: విజయసాయిరెడ్డి
అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పిస్తూ చేసిన తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి ప్రభుత్వం పంపనుంది. ..

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) రాజధాని చట్టబద్ధత కల్పిస్తూ చేసిన తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ(Ap Assembly) ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి ప్రభుత్వం పంపనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Mp Vijayasaireddy ) స్పందించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇప్పటి వరకూ ఏం న్యాయం చేశారంటూ ప్రశ్నించారు. ‘‘2015లో ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చిన రైతుల్లో ఎవరైనా వారికి కేటాయించిన ప్లాట్‌లో ఇల్లు కట్టుకోగలిగారా?. వారిలో ఏ ఒక్క రైతు అయినా వారికి ఇచ్చిన కమర్షియల్ స్థలంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టగలిగారా?. ఈ 11 ఏళ్ళ కాలంలో వారికి కేవలం ఏడాదికి ఇంత అని నామమాత్రంగా డబ్బు ఇవ్వటం వల్ల కలిగిన లాభం ఏమిటి?. రైతుల త్యాగాలు వెల కట్టలేనివి అని నిన్న శాసన సభలో పలువురు సభ్యులు చెప్పారు. ఈ ఎమోషనల్ డైలాగుల వల్ల రైతులకు న్యాయం జరగదు.’’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
‘‘భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికి అయినా ఇంతకుముందు మీరు ఇస్తాం అన్న ఇళ్ల స్థలం, కమర్షియల్ స్థలం మాత్రమే కాకుండా, అదనంగా ఫెయిర్ కాంపిన్సేషన్ చట్టం 2013 ప్రకారం నష్ట పరిహారం ఇవ్వండి. ఎసైన్డ్ భూముల విషయంలో ఒరిజినల్ ఎసైనీలకే నష్ట పరిహారం ఇవ్వండి. అలాగే మరో విషయాన్ని కూడా అడుగుతున్నా, నిరుపేదలకు గత ప్రభుత్వం కేటాయించిన 50 వేల ఇళ్ల పట్టాలను మీరెందుకు రద్దు చేశారు? ఆ ప్లాట్లను ఆ నిరుపేదలకే తిరిగి ఇవ్వండి. ఒక వైపు లక్షల కోట్లతో రాజధాని కడతాం అంటున్న మీరు కట్టండి కానీ ఆ భూములు ఇచ్చిన రైతులకే న్యాయం చేయనట్టయితే, ఆ నిర్మించే భారీ భవనాల పునాదులు ఎవరి భూముల్లో నిర్మిస్తున్నారో వారికే సంతృప్తి, సంతోషం కలిగించనట్టయితే... అలా నిర్మించే రాజధాని వల్ల ఏ ధనికులకి, బూర్జువాలకి లాభం కలుగుతుందో ప్రజలు కూడా ఆలోచన చేస్తారని మీరు కూడా గమనించండి.’’ అని ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు.






