బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి మంత్రి పయ్యావుల.. కాసేపట్లో చంద్రబాబుకు అందజేత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-28 04:00:14  IST  )

కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు..

బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి మంత్రి పయ్యావుల.. కాసేపట్లో చంద్రబాబుకు అందజేత
X

దిశ, వెబ్ డెస్క్: కాసేపట్లో ఏపీ అసెంబ్లీ(AP Assembly)లో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల(Minister Payyavula) ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు తన నివాసంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. బడ్జెట్ కాపీలను మంత్రి పయ్యావులకు ఉన్నతాధికారులు అందజేశారు. బడ్జెట్ ప్రతులకు శాస్త్రోకంగా పూజలు చేశారు. బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి మంత్రి పయ్యావుల బయలుదేరారు. సీఎం చంద్రబాబుకు బడ్జెట్ ప్రతులను పయ్యావుల అందచేయనున్నారు.

కాగా ఏపీ అసెంబ్లీలో 2025-26కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌‌ను 11 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి రూ. 3.20 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. కాసేపట్లో కేబినెట్ భేటీ అయి ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు. అనంతరం అసెంబ్లీలో అసెంబ్లీ(Assembly)లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Finance Minister Payyavula Keshav), శాసనమండలిలో మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Next Story