అమరావతి బిల్లుపై రాజ్యసభలో చర్చ.. ఎంపీ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-02 08:07:13  IST  )

అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఏపీ రాజధాని చట్టబద్ధత బిల్లుపై రాజసభ సభ్యురాలు రేణుకాచౌదరి మాట్లాడారు....

అమరావతి బిల్లుపై రాజ్యసభలో చర్చ.. ఎంపీ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఏపీ రాజధాని చట్టబద్ధత బిల్లుపై రాజసభ సభ్యురాలు రేణుకాచౌదరి మాట్లాడారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు తాము పూర్తి మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇది అమరావతి రైతుల విజయమని ఆమె తెలిపారు. 12 ఏళ్ల తర్వాత ఈ బిల్లు మళ్లీ రావడం చాలా బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఎంత వేధించిన వెనక్కి తగ్గకుండా నిరసనను వ్యక్తం చేశారని గుర్తు చేశారు. పాలసీ పెరాలసిస్ కారణంగా పన్నెండు సంవత్సరాలు ఏపీ నష్టపోయిందన్నారు. రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలు అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని రేణుకా చౌదరి తెలిపారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ హామీని కూడా నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు.

తెలంగాణకు మొండి చెయ్యి

తెలంగాణకు మాత్రం మొండి చెయ్యి చూపిస్తున్నారని ఆరోపించారు. ఐదు గ్రామాలను తెలంగాణను ఇవ్వాలని కోరారు. తెలంగాణలో ఉండాలని కోరుకుంటున్నా వాళ్లను ఏపీలో కలిపారని చెప్పారు. గుజరాత్ నగరాలకు లక్షల కోట్లు కేటాయించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కానీ, సౌత్ కారణంగా తెలుగు రాష్ట్రాలను అవమానిస్తున్నారని ఎంపీ రేణుకా చౌదరి మండిపడ్డారు.

Next Story