- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News: విశాఖ ఎన్నికల్లో కూటమి ఘన విజయం
ఉత్కంఠగా జరిగిన విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది...

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు(GVMC Standing Committee Elections) ఉత్కంఠగా జరిగాయి. గత ఏడాది మాదిరిగా ఈ సంవత్సరం కూడా స్టాండింగ్ కమిటీని పూర్తిగా కూటమి పార్టీలు కైవసం చేసుకుంటుందని అనుకున్నారు. అయితే ఈ సారి అలా కుదరలేదు. వైసీపీ(Ycp) గట్టి పోటీ ఇవ్వడంతో 9 స్థానాలకే కూటమి పరిమితం అయింది.
కాగా విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు బుధవారం జరిగాయి. అయితే మెజార్టీ స్థానాలు కూటమికి దక్కాయి. పది స్థానాల్లో 9 టీడీపీ(Tdp) గెలుచుకోగా.. వైసీపీ కేవలం ఒక స్థానానికి మాత్రమే పరిమాతమైంది. 8 స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో బీజేపీ(Bjp), మరో స్థానంలో వైసీపీ గెలిచాయి. ఈ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మొత్తం 92 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని భావిస్తున్నారు. దీని వల్లనే 10కి 10 స్థానాలు కైవసం చేసుకోలేకపోయామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కూటమి ఖాతాల్లో ఉన్నాయి. తాజాగా స్టాండింగ్ కమిటీ కూడా దాదాపు కూటమి నేతల చేతుల్లో ఉంది. ఒకే ఒక్కస్థానాన్ని మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంది.






