పైకి బ్రాండెడ్ బస్తా..లోపల బూడిద.. కస్తూరి సిమెంట్స్‌పై అధికారులు దాడులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-10 13:30:56  IST  )

రాయలసీమలో కల్తీ సిమెంట్ దందా జోరుగా నడుస్తోంది. ...

పైకి బ్రాండెడ్ బస్తా..లోపల బూడిద.. కస్తూరి సిమెంట్స్‌పై అధికారులు దాడులు
X

దిశ, వెబ్ డెస్క్: రాయలసీమ(Rayalaseema)లో కల్తీ సిమెంట్(Fake Cement) దందా జోరుగా నడుస్తోంది. బస్తాలపై బ్రాండెడ్ లేబుళ్లు వేసి బూడిద అధిక సంఖ్యలో కలిసిన సిమెంట్‌ను నింపి అమ్ముతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల(Gorantla)లో కల్తీ సిమెంట్ దందా కలకలం రేపింది. కస్తూరి సిమెంట్స్‌పై విజిలెన్స్ అధికారులు(Vigilance officers) జరిపిన దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి రోజు 3 వేలకుపైగా నకిలీ బస్తాలు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.


కర్నూలుకు చెందిన మహేశ్ అనే వ్యక్తి.. తమిళనాడు, కర్ణాటకలో భారీగా కల్తీ సిమెంట్స్‌ను మార్కెటింగ్ చేసినట్లు అధికారులు నిర్ధారణ చేశారు. లేపాక్షి డంపింగ్ గోదాముల్లో నకిలీ సిమెంట్స్‌ను తయారు చేసినట్లు సమాచారం అందుకుని రైడ్ చేశారు. 335 నకిలీ సిమెంట్ బస్తాలతో రెడీగా ఉన్న మినీ లారీని గుర్తించారు. సిమెంట్‌లో ఫ్లైయాష్ కలిపి ఒరిజినల్‌గా మార్కెటింగ్ చేస్తున్నట్లు అధికారులు తనిఖీల్లో తేలింది. దీంతో సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒరిజనల్ సిమెంట్ కంటే రూ. 5 తక్కువగా అమ్ముతున్నారని అధికారులు తెలిపారు. పది కంపెనీలకు చెందిన ఖాళీ బస్తాలను తనిఖీల్లో గుర్తించినట్లు చెప్పారు.

Next Story