- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Adoni Court: పోసాని కస్టడీ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్.. లాయర్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ మాజీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి కస్టడీ పిటిషన్‌పై కర్నూలు జిల్లా ఆదోని కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది..

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కస్టడీ పిటిషన్‌పై కర్నూలు జిల్లా ఆదోని కోర్టు(Adoni Court) తీర్పు రిజర్వ్ చేసింది. పోసానిని కస్టడీకి కోరుతూ పోలీసులు తరపున దాఖలైన పిటిషన్‌తో పాటు తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. పోసాని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
ఈ సందర్భంగా పోసాని లాయర్ మాట్లాడుతూ ‘‘పోసాని బెయిల్ అప్లికేషన్‌పై మా లీగల్ టీమ్ వాదనలు వినిపించింది. ప్రాసిక్యూషన్ వారు కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పడంతో ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది. పోలీసులు దాఖలు చేసిన కస్టడి పిటిషన్‌పైనా వాదనలు వినిపించాం. పోసానిని కస్టడీకి ఇవ్వాల్సి వస్తే లాయర్ సమక్షంలో ఒక రోజు విచారణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాం. అలాగే పోసాని అనారోగ్యం దృష్ట్యా ఎస్పీ, డీఎస్పీ సమక్షంలో విచారణ జరగాలని అభ్యర్థించాం. మా అభ్యర్థనను పరిగణననలోకి తీసుకుని రేపో, ఎల్లుండో తీర్పు వచ్చే అవకాశం ఉంది. బెయిల్‌పై కూడా వాదనలు వినిపించాం. పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మరోసారి వాదనలు వినిపిస్తాం. రేపు గాని, ఎల్లుండి గాని బెయిల్ పిటిషన్‌పై తీర్పు వచ్చే అవకాశం ఉంది. పోసానికి బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాం’’ అని పోసాని తరపున లాయర్ పేర్కొన్నారు.






