గ్యాంగ్ రేప్ కేసులో సంచలనం.. బేడీలతో నిందితులను కి.మీ మేర నడిపించిన పోలీసులు

by Vemula.Srinu Prasad |

గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులను పోలీసులు రోడ్డుపై నిడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు....

గ్యాంగ్ రేప్ కేసులో సంచలనం.. బేడీలతో నిందితులను కి.మీ మేర నడిపించిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati) మురకంబట్టు నగరవనం(Murakambattu Nagaravan)లో ప్రియుడిని కట్టేసి ప్రియురాలపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్‌(Gang Rape)నకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ముగ్గురు నిందితులను పోలీసులు ఈ రోజు కోర్టులో ప్రవేశ పెట్టారు. కానీ అంతకంటే ముందు అందరూ చూసేలా ముగ్గురు నిందితులను కోర్టు వరకు బేడీలతో రోడ్డుపై కిలో మీటర్ మేర నడింపించారు. ఈ దృశ్యాలను చూసిన జనం.. పోలీసులను మెచ్చుకున్నారు. నిందితులకు ఇలాంటి శాస్తి జరగాల్సిందేనన్నారు. కోర్టు కూడా కఠిన శిక్ష అమలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక ముగ్గురు నిందితులు గతంలో ప్రేమికులే టార్గెట్‌గా అరాచకాలకు పాల్పడ్డారు. పార్కుల్లో, ఖాళీ ప్రదేశాల్లో ఉన్న ప్రేమ జంటలపై దౌర్జన్యాలకు పాల్పడ్డారు. వారిని బెదిరించి డబ్బులు, బంగారు నగలు దోచుకోవడమే కాకుండా యువతులపై అఘాయిత్యాలకు కూడా పాల్పడ్డారు. మురకంబట్టు నగరవనం ఘటనతో ఈ విషయాలన్ని వెలుగులోకి వచ్చారు. నగరవనంలో ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటపై దాడి చేయడమే కాకుండా ప్రియుడి ఎదుటే ప్రియురాలను అత్యాచారం చేశారు. యువతి కేకలు విన్న స్థానికులు.. ముగ్గురు యువకులను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు నిందితులు స్థానిక నాయకులతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ దుమారం సైతం చెలరేగింది. చివరకు నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టడంతో ధర్మాసనం రిమాండ్ విధించింది.

Next Story