లిక్కర్ కేసులో నిందితులకు బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ నిరాకరణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-16 08:45:09  IST  )

ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది...

లిక్కర్ కేసులో నిందితులకు బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ నిరాకరణ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కాం కేసు(AP Liquor Scam Case)లో నిందితులకు సుప్రీంకోర్టు(Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్(Anticipatory bail) ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. కేసు దర్యాప్తు కీలకంగా ఉన్న సమయంలో బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. నిందితులకు బెయిల్ ఇస్తే విచారణ అధికారి చేతులు కట్టేసినట్లవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.

కాగా ఏపీ లిక్కర్ స్కా కేసులో సిట్ అధికారుల విచారణ ముమ్మరంగా జరుగుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో లిక్కర్ క్రయ, విక్రయాల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. మరింత విచారణ కోసం కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి(Krishnamohan Reddy), ధనుంజయ్ రెడ్డి(Dhanunjay Reddy) ని సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే బెయిల్ కోసం ఇద్దరు నిందితులు ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం..ఈ ఇద్దరు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

Next Story