- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YogAndhra-2025:కృష్ణా నదిలో జల యోగ సాధన.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఆ ఫొటో
ఇవాళ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఏపీ(Andhra Pradesh)లోని విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

దిశ,వెబ్‌డెస్క్: ఇవాళ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఏపీ(Andhra Pradesh)లోని విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి మంత్రులు, అధికారులు కూడా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏపీలోని అన్ని జిల్లాల్లో యోగా వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ తరుణంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో జల యోగా నిర్వహించారు. జలయోగా లో అధిక సంఖ్యలో యోగ సాధకులు పాల్గొన్నారు. అయితే, నాగాయలంకలో ప్రతిరోజూ జల యోగా చేస్తున్న విషయం తెలిసిందే. జల యోగ చేస్తే అనారోగ్య సమస్యలు అధిగమించే అవకాశం ఉంటుందని అన్నారు. జలయోగా కార్యక్రమంలో భాగంగా నీటిలో తేలియాడుతూ వేసిన ఆసనాలు డ్రోన్ కెమెరా ద్వారా బంధించారు. జలయోగా అనేది నీటిలో తేలియాడుతూ చేస్తారు. ఇది శారీరక వ్యాయామం, మెడిటేషన్, శ్వాస నియంత్రణకు తోడ్పడుతుంది. అయితే, ఈ జల యోగాలో శ్వాస నియమాలు పాటిస్తూ నీటిలో తేలియాడుతూ ఉండడం వల్ల కీళ్లు, కండరాల పై ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో యోగా సాధకులు జల యోగాసనాలు వేస్తున్న ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.






