- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్.. ఏకంగా 48 మందికి నోటీసులు
అధికార పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది..

దిశ, వెబ్ డెస్క్: అధికార పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా ప్రజల్లోకి కొందరు ఎమ్మెల్యేలు వెళ్లకపోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) సీరియస్ అయ్యారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ తీరు మారకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఈ మేరకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. పింఛన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో48 మంది ఎమ్మెల్యేలు పాల్గొనడంలేదని గుర్తించారు. వారందరికీ నోటీసులు ఇవ్వాలని కూటమి పార్టీ అధ్యక్షులను ఆదేశించారు. స్వయంగా తాను లబ్ధిదారులను కలిసి పింఛన్లు అందిస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు ప్రజలకు సేవలందించడంలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు తమ నియోకవర్గాల్లో ప్రజా దర్బార్ నిర్వహించాల్సిదేనన్నారు. ప్రతి నిత్యం ప్రజల్లో ఉండి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. ఎవరూ బేఖాతరు చేసినా భవిష్యత్తులో పరిణామాలు తప్పవ్ అని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.






