TDP Mahanadu:‘ఆ ఘనత సీఎం చంద్రబాబుకే దక్కింది’.. మంత్రి కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

టీడీపీ మహానాడు కార్యక్రమం మూడో రోజు ఘనంగా జరుగుతుంది.

TDP Mahanadu:‘ఆ ఘనత సీఎం చంద్రబాబుకే దక్కింది’.. మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ మహానాడు కార్యక్రమం మూడో రోజు ఘనంగా జరుగుతుంది. కడప జిల్లాలో భారీ ఎత్తున నిర్వహించిన టీడీపీ మహానాడు.. ఈ రోజు(గురువారం) ముగుస్తుండటంతో భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ మహానాడు వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కృషి వల్లనే గత ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లకు ఏడు స్థానాలు గెలిచామని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఈ ప్రాంతం నుంచి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు చేసింది ఏమీ లేదని మంత్రి తెలిపారు. టీడీపీ కార్యకర్తలను హింసించడం, హత్యా రాజకీయాలు చేయడం తప్ప గత ప్రభుత్వం చేసింది ఏమి లేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నమ్మకానికి, విశ్వాసానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు నిదర్శనం అని తెలిపారు.

వైఎస్ కుటుంబం దగ్గర ఉంటే చివరికి మాకు దక్కింది హింసే.. వారు ఎవరినీ ప్రోత్సహించలేదు. ఈరోజు వారిని వ్యతిరేకించి టీడీపీ పార్టీలోకి వచ్చి ముగ్గురం ఎమ్మెల్యేలం అయ్యామంటే ప్రజలు గమనించాలి. మరో 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు, నారా లోకేష్ ఉంటనే ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగేదని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్న ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన హంద్రీ నీవా, గాలేరులను ఒక రూపానికి తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కింది. ఈ క్రమంలో చంద్రన్న పాలనలోనే రాయలసీమ సిరుల సీమగా మారుతుందని తెలియజేస్తున్నానని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

Next Story