‘ఆ ఘనత మాజీ సీఎం జగన్‌దే’.. బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-20 13:19:32  IST  )

ఏపీ అసెంబ్లీ సమావేశం(AP Assembly Meetings)లో వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ఆ ఘనత మాజీ సీఎం జగన్‌దే’.. బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశం(AP Assembly Meetings)లో వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలు ఎక్కడ? అని ప్రశ్నించారు. ఈ రోజు(బుధవారం) అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ పై చర్చలు జరిగాయి. దీనిపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ పై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అసలు వర్గీకరణ ఎలా చేశారన్న దానిపై చర్చే జరగలేదని మండిపడ్డారు.

అట్టడుగు వర్గాలపై కూటమికి ప్రత్యేక ద్వేషం ఉంది. గతంలో వర్గీకరణ కోసం పోరాడిన వారి పై టీడీపీ సర్కార్ కేసులు పెట్టి అరెస్టులు చేసింది. ఆ కేసులను ఎత్తేసిన ఘనత జగన్‌దే. ఇలా వర్గీకరణ చేయడం సమంజసం కాదు అని ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు. అన్ని కులాల వారికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్టు పై చర్చ లేకుండా ప్రకటన ఇచ్చారని ఫైరయ్యారు.

ఈ క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan) అన్ని కులాలను గౌరవించారని తెలిపారు. పదవుల్లోనూ అందరికీ న్యాయం చేశారు. కూటమి ప్రభుత్వ తీరును మేం తప్పుపడుతున్నాం అని ఆయన అన్నారు. గౌరవంగా అన్ని వర్గాలు జీవించేలా ప్రభుత్వం(AP Government) చొరవ తీసుకోవాలని బొత్స సత్యనారాయణ తెలిపారు. అందరికీ మంచి చేయాలన్నదే మా కోరిక.. అధికార పార్టీ సభ్యులు రోజూ చెప్పిందే చెబుతున్నారని విమర్శించారు.

Next Story