- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Jagan : ఆ దాడి మానవ హక్కుల ఉల్లంఘన : తెనాలి ఘటనపై జగన్ ఆగ్రహం
సోమవారం ఆంధ్రప్రదేశ్(AP)లోని గుంటూరు జిల్లా తెనాలి(Tenali Incident) పట్టణంలో ముగ్గురు దళిత యువకులను పోలీసులు నడిరోడ్డుపై పాశవికంగా కొట్టారు.

దిశ, వెబ్ డెస్క్ : సోమవారం ఆంధ్రప్రదేశ్(AP)లోని గుంటూరు జిల్లా తెనాలి(Tenali Incident) పట్టణంలో ముగ్గురు దళిత యువకులను పోలీసులు నడిరోడ్డుపై పాశవికంగా కొట్టారు. ఈ ఘటనపై ఏపీ మాజీ సీఎం, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు(YSRCP Cheif) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని ఆయన "మానవ హక్కుల ఉల్లంఘన"(Human Rights Violation)గా అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం "రెడ్ బుక్ రాజ్యాంగం"(Red Book Constitution) నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని, వారికి ఇలా చేసే హక్కు లేదని, ఇది మానవ హక్కులపై దాడి అని జగన్ స్పష్టం చేశారు.
ఈ ఘటనలో పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, యువకులను కర్కశంగా కొట్టారని, ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేసే చర్య అని జగన్ విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అణగారిన వర్గాల పట్ల కఠినంగా వ్యవహరిస్తోందని, పోలీసులు ఈ విధంగా చేయడం ద్వారా నాయకుల వైఖరిని ప్రతిబింబిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన పోలీసులను కఠినంగా శిక్షించాలని జగన్ ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి(CM Chandrababu Naidu)ని డిమాండ్ చేశారు.






