- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Deputy CM:‘వారందరికీ ధన్యవాదాలు’.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!
జమ్మూ & కాశ్మీర్, పహాల్గంలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటన యావత్ దేశాన్ని కదిలించింది.

దిశ,వెబ్‌డెస్క్: జమ్మూ & కాశ్మీర్, పహాల్గంలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ ఉగ్రమూకలపై "ఆపరేషన్ సిందూర్" పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద మూలాలపై, వారికి సహకరిస్తున్న పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేసి ఉగ్రమూకలను అంతం చేసి.. భారత్ కు రక్షణ కవచంలా నిలిచిన భద్రతా దళాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) పేర్కొన్నారు.
ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారత దేశానికి, రక్షణ బలగాల రక్షణ కోసం తమిళనాడు లోని దేవ సేనాని శ్రీ సుబ్రమణ్య స్వామి వారి 6 షష్ట షణ్ముఖ ఆలయాల్లో, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 4 సుబ్రమణ్య స్వామి ఆలయాల్లో, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వారి ఆలయంలో, అరసవల్లి శ్రీ సూర్య నారాయణ ఆలయంలో, ఇతర ఆలయాలు, మసీదుల్లో, చర్చిల్లో సర్వమత ప్రార్థనలు చేసిన జనసేన నాయకులకు, జనసైనికులు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన పార్టీ PAC చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్, MLC పిడుగు హరిప్రసాద్, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు, తదితరులకు అలాగే మతాలకు అతీతంగా ఈ సర్వ మత ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారత సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు, ఉగ్రవాదాన్ని తుద ముట్టించేందుకు ఒక్కరూ సమిష్టిగా, బలంగా నిలబడదాం, భారత దేశపు ఐక్యతను చాటి చెపుదామని డిప్యూటీ సీఎం పవన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.






