థ్యాంక్యూ సీఎం సర్ : మంత్రి కందుల దుర్గేష్

by Thanuru Gopichand |

నిడదవోలు నియోజకవర్గంలోని ఎర్రకాలువ మరమ్మతుకు నిధులు కేటాయించి పనులను ప్రారంభించేందుకు సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh ధన్యవాదాలు తెలిపారు.

థ్యాంక్యూ సీఎం సర్ : మంత్రి కందుల దుర్గేష్
X

దిశ, వెబ్ డెస్క్ : నిడదవోలు నియోజకవర్గంలోని ఎర్రకాలువ మరమ్మతుకు నిధులు కేటాయించి పనులను ప్రారంభించేందుకు సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh ధన్యవాదాలు తెలిపారు. ప్రతీ ఏటా ఎర్రకాలువకు వస్తున్న వరద నీరు కారణంగా కాలువ గట్లు కోతకు గురవుతున్న నేపథ్యంలో వాటి పటిష్టత కోసం తాను చేపట్టిన చేపట్టిన చర్యలు సఫలీకృతమయ్యాయి అన్నారు. కేబినెట్ లో తన విజ్ఞప్తి మేరకు ఎర్రకాలువ గట్ల పటిష్టతకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. రూ. 1.8 కోట్ల ఎఫ్డీఆర్ (Flood Damage Repair) నిధులతో ఎర్రకాలువ మరమ్మతులు (Erra Kaaluva Repairs) చేపట్టేందుకు శ్రీకారం చుట్టిందన్నారు.

కేబినెట్ కు విజ్ఞప్తి చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి కందుల దుర్గేష్ నియోజకవర్గ రైతాంగం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే నిడదవోలు మండలం సింగవరం వద్ద ఎర్రకాలువపై 2 షటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారని పేర్కొన్నారు. షెటర్ల ఏర్పాటు ద్వారా భారీ వర్షాలు, వరదల వల్ల ముంపుకు గురవుతున్న దాదాపు 5000 ఎకరాలకు ఇక ఎలాంటి ఢోకా లేదని మంత్రి తెలిపారు. నిడదవోలు మండలంలోని సింగవరం, కంసాలిపాలెంలో బ్రీచ్ క్లోజింగ్, గేట్లు ఏర్పాటు చేయడం వల్ల పంట పొలాల్లోకి నీరు వెళ్లకుండా ఉంటుందన్నారు. ఎక్కడెక్కడ గండ్లు పడ్డాయో వాటిని కూడా పూడ్చివేయడం వల్ల వచ్చే సీజన్ నుంచి ముంపు సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.

Next Story