Thandel Movie Team : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తండేల్ మూవీ టీమ్

by Y. Venkata Narasimha Reddy |
Thandel Movie Team  : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తండేల్ మూవీ టీమ్
X

దిశ, వెబ్ డెస్క్: తండేల్ సినిమా(Thandel Movie) బాక్సాఫిస్ వద్ధ మంచి వసూళ్లతో దూసుకపోతున్న నేపథ్యంలో చిత్ర బృందం(Movie Teamఈ రోజు తిరుమల శ్రీవారిని(Visits) దర్శించుకుంది. హీరో నాగచైతన్య(Hero Naga Chaitanya), హీరోయిన్ సాయి పల్లవి(Heroine Sai Pallavi), నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, డైరెక్టర్ చందు మొండేటి తదితరులు శ్రీవారిని దర్శించుకుని సేవించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

ముందుగా ఆలయ సిబ్బంది వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వదించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. నాగచైతన్య, సాయిపల్లవిలనుని చూసేందుకు అభిమానులు, భక్తులు ఆసక్తి చూపి వారితో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ "తండేల్ సినిమా విడుదలకు ముందు నిర్మాత బన్నీ వాసు వచ్చి చిత్రం విజయం సాధించాలని స్వామివారిని కోరుకున్నారని.. ఆయన కోరిక ఫలించి చిత్రం భారీ విజయాన్ని అందుకుందన్నారు.

అందుకే మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చామని.. మా చిత్ర బృందం అంతా స్వామివారిని దర్శించుకున్నాని తెలిపారు. మా తండేల్ సినిమాకు పెద్ద విజయాన్ని కట్టబెట్టిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.

Advertisement
Next Story