TG Assembly: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం

by Kema Shiva Kumar |   (  Updated:2024-12-30 05:09:15  IST  )

తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ప్రత్యేక సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది.

TG Assembly: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ప్రత్యేక సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ మేరకు ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ (Former Prime Minister)కు సభ నివాళులర్పించనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఆయన మృతి పట్ల అన్ని పార్టీల సభ్యులు సంతాపం తెలుపనున్నారు. దేశానికి ప్రధానిగా మన్మోహన్ సింగ్ చేసిన విశిష్ట సేవలను గుర్తు చేసుకోనున్నారు. మాజీ ప్రధానికి నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రసంగం చేయనున్నారు.

Next Story